- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులను బెదిరిస్తే ఊరుకునేది లేదు : పవన్ కళ్యాణ్
by Muthe.Rajitha |
పోలీసులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : పోలీసులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేడు మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఏపీ మాజీ సీఎం పోలీసు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి బెదిరింపులను చూస్తూ ఉరుకుంటామని అనుకోవద్దని హెచ్చరించారు. గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పై కేసులు వేస్తె.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
పోలీసు శాఖలో పనిచేసేవారు, ప్రజలతో మమేకం అయ్యి, వారితో ఫ్రెండ్లీగా ఉండాలని అన్నారు. ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం ఉన్నపుడే వారి సమస్యలు చెప్పుకోడానికి స్టేషన్ కి వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని ప్రసంగించారు. అనంతరం అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.
Next Story






