అడవుల జోలికి వెళ్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్

by Muthe.Rajitha |

అడవుల జోలికి వెళ్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

అడవుల జోలికి వెళ్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్ : అడవుల జోలికి వెళ్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, కొండపావులూరులోని NIRD ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ షాప్ లో ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అడవుల ఆక్రమణలను కఠినంగా ఎదుర్కొంటామని, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పెంపకానికి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. దేశ అవసరాలకు తగిన కలప సరఫరా చేస్తామని, అటవీశాఖ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అడవుల పరిరక్షణ, ఎకో టూరిజం, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్ర, మానవులు- జంతువుల సంఘర్షణ నివారణ చర్యలు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ వర్క్ షాప్ లో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ చలపతిరావు, అటవీ శాఖ సలహాదారు మల్లిఖార్జున రావు, తదతరులు పాల్గొన్నారు.

Next Story