KRMB:తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు.. ఉత్తర్వులు జారీ

by Jakkula.Mamatha |

వేసవి నేపథ్యంలో పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) నిర్ణయం తీసుకుంది.

KRMB:తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు.. ఉత్తర్వులు జారీ
X

దిశ,వెబ్‌డెస్క్: వేసవి నేపథ్యంలో పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీలు, తెలంగాణ(Telangana) రాష్ట్రానికి 10.26 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir)లో 800 అడుగుల వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లో 505 అడుగుల వరకు నీటిని వాడుకోవడానికి అనుమతించింది. ఏపీ(Andhra Pradesh) అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తెలిపింది. ఇక, జులై నెలాఖరు వరకు శ్రీశైలం జలాశయంలో కనీసం 800 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని కేఆర్ఎంబీ ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది.

Next Story