- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలోని ఆ ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఉత్తర్వులు జారీ
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఏపీ(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో పని చేసే డాక్టర్లు, ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
ఈ క్రమంలో వైద్యులకు పలు కీలక సూచనలు చేశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని హాస్పిటల్ సూపరిటెండ్‌లకు సూచించింది. అత్యవసర సమయంలో ఎలా వైద్యం అందించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించాలని తెలిపారు. ఆక్సిజన్ సదుపాయాన్ని మెరుగుపరచాలని ఉన్నతాధికారులు వైద్యులను ఆదేశించారు. ఇక, తెలంగాణ(Telangana)లో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ లోని స్టాఫ్‌ల సెలవులను రద్దు చేసింది. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని హాస్పిటల్ సూపరిటెండ్‌లకు సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు రద్దు చేసుకోవాలని సీఎం రేవంత్(CM Revanth Reddy) రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.






