- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ ప్రమాదం.. ఒకరు సజీవదహనం
టాటా నగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు (18189) అర్థరాత్రి అగ్నిప్రమాదానికి గురైంది.

దిశ, వెబ్‌డెస్క్: టాటా నగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ రైలు (18189) అర్థరాత్రి అగ్నిప్రమాదానికి గురైంది. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో B1 ఏసీ బోగీలో మంటలు చెలరేగగా.. అవి M2 బోగీకి కూడా వ్యాపించాయి. లోకోపైలట్లు గమనించి రైలును ఎలమంచిలి స్టేషన్లో నిలిపివేయగా.. ప్రయాణికులు భయాందోళనతో బోగీల నుంచి పరుగులు తీశారు. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పగా.. అప్పటికే రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో రైలులో 2 వేల మంది ప్రయాణికులు ఉండగా.. వారంతా చలిలో ప్లాట్ ఫామ్ పై పడిగాపులు పడ్డారు. మంటలు అదుపులోకి రాగా.. ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి, మిగతా బోగీల్లో ప్రయాణికులను సర్దుబాటు చేసి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రమాదం కారణంగా విశాఖ - విజయవాడ మార్గలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి, తుని, విశాఖ స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి.
ఒకరు సజీవదహనం.. విచారణ ప్రారంభం
ఘటనా ప్రాంతానికి విజయవాడ డీఆర్ఎం మోహిత్ చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు సజీవదహనం అయ్యారని, మృతుడిని విశాఖకు చెందిన చంద్రశేఖర్ (70)గా గుర్తించామన్నారు. B1లోనే మంటలు చెలరేగిట్లుగా తెలుస్తోందని, ఏసీ కోచ్ కావడంతో దుప్పట్లకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయని తెలిపారు.
బోగీల్లో ఇంకా ఎవరైనా చిక్కుకుని మరణించారా అని తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై మిగతా కోచ్ లను వాటి నుంచి వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.






