- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఫారం పాండ్స్.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పల్లెల్లో ప్రగతి వెలుగులు నింపుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ పల్లెల్లో ప్రగతి వెలుగులు నింపుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్పేర్కొన్నారు. ఈ రోజు ఎక్స్‌లో ఒక పోస్టు చేశా రు. గ్రామీణాభివృద్ధి శాఖ (Department of Rural Development) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఫారం పాండ్స్ (Farm Ponds) నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులో తీసుకువచ్చామని ఆయన వివరించారు. అనావృష్టి పరిస్థితుల్లో సైతం అన్నదాత ఇంట సిరులు పండించేందుకు ఫారం పాండ్స్ దోహదపడతాయని తెలిపారు. నిస్తేజమైన భూముల్లో జీవం నింపడంతో పాటు భూగర్భ జలాల వృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఉపాధి శ్రామికులకు పని కల్పించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ఫారం పాండ్స్ ద్వారా సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసే సామర్ధ్యాన్ని వృద్ధి చేయగలిగామన్నారు.
రైతులు అందించిన సహకారoతోనే ఇది సాధ్యపడిందని పవన్పేర్కొన్నారు. ఫారం పాండ్స్ ఆవశ్యకతను గుర్తించి తమ వ్యవసాయ క్షేత్రాల్లో తవ్వించుకునేందుకు ముందుకు వచ్చిన రైతులకు, ఈ యజ్ఞంలో భాగస్వాములు అయిన గ్రామీణా భివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి ఫీల్డు అసిస్టెంట్ వరకు యంత్రాంగానికి, ఉపాధి శ్రామికులకు పేరు పేరునా అభినందనలు తెలియజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రం వ్యాప్తంగా భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమా లు చేపట్టేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి (Chandrababu) ఆయన కృతజ్క్షతలు తెలిపారు.






