- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశింకోట తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి నోటీసులు
అవినీతి అధికారులపై ఏపీ కూటమి ప్రభుత్వం చర్యలు.

దిశ, వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లా కశింకోట (Kasimkota) తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildhar Office) చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. 2020 సెప్టెంబర్ 2న ఈ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పరిపాలనలో తీవ్రమైన లోపాలు, అనధికార వ్యక్తుల ప్రమేయం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. సివిల్ సర్వీస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు రెవెన్యూ శాఖకు సమగ్ర నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో మాజీ తహశీల్దార్ బత్తుల సుధాకర్ సహా మొత్తం 14 మంది సిబ్బందికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సాయి ప్రసాద్ ఈ మేరకు నోటీసులను జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
గతంలో జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 1,901 మ్యుటేషన్ దరఖాస్తులను పరిశీలించగా, వాటిలో 941 దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కార్యాలయంలోని సేఫ్ బాక్సుల్లో లెక్కల్లో చూపని నగదు లభించడం, రైతులకు అందజేయాల్సిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పెండింగ్‌లో ఉంచడం వంటి అక్రమాలు వెలుగు చూశాయి. కార్యాలయంలో ఏ సంబంధం లేని నలుగురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వర్తించడంపై ఏసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నోటీసులకు స్పందన వచ్చిన అనంతరం బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






