- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పు చేసినోళ్లు ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్
వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై మరోసారి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలపై మరోసారి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇవాళ అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన పాపాల చిట్టాపై వరుసగా విచారణలు జరుగుతున్నాయని అన్నారు. తప్పు చేసిన వాళ్లెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. గత సంవత్సరం మద్యం అక్రమాలతో మద్యం నామ సంవత్సరంగా మారిందని, వైసీపీ (YCP) నాయకులు మద్యం ద్వారా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కల్తీ మద్యం, డిజిటల్ పేమెంట్లు లేకుండా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని, ఇప్పుడు ఆ అవినీతిపై సిట్ విచారణలు జోరుగా సాగుతున్నాయని తెలిపారు.
ఈ సంవత్సరం భూమి నామ సంవత్సరం కావొచ్చని మంత్రి సత్యప్రసాద్ సెటైర్లు వేశారు. గత ప్రభుత్వ హయాంలో భూముల్లో జరిగిన అక్రమ కేటాయింపులు, ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు, భూ మాఫియా కార్యకలాపాలపై కూడా విచారణ జరుగుతోందని, దోషులందరినీ చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. జగన్ (Jagan) పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమం, న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. తప్పులు చేసిన వారికి ఎటువంటి వెసులుబాటు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన మంత్రి అనగాని స్పష్టం చేశారు.






