- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ కార్యకర్తలతో నిరంతరం సంబంధం కొనసాగించాలి.. వెంకయ్యనాయుడితో నితిన్ నబీన్ భేటీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతనంగా నియమిత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతనంగా నియమిత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో (గురువారం) ఈ ఉదయం నితిన్ నబీన్ తనను కలిసినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు వెంకయ్యనాయుడు వెల్లడించారు. బీజేపీ గత జాతీయ అధ్యక్షుడిగా తన అనుభవాలను, పార్టీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే అంశాలపై తన ఆలోచనలను నితిన్ నబీన్‌తో పంచుకున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ, పార్టీ కార్యకర్తలతో నిరంతరం సంబంధం కొనసాగించడం అత్యంత అవసరమని సూచించినట్లు తెలిపారు. అలా చేయడం ద్వారా ప్రజల ఆకాంక్షలు, పార్టీ కేడర్ ఆశయాలు నెరవేరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలియజేసిన వెంకయ్యనాయుడు, నితిన్ నబీన్‌తో సమావేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ట్వీట్ ఇదే..






