- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీకి చేరిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం
టాలీవుడ్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఢిల్లీకి చేరింది. శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న వీణ ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఢిల్లీకి చేరింది. శ్రీధర్ పై ఆరోపణలు చేస్తున్న వీణ ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేసింది. శ్రీధర్ పై న్యాయవాది అజాద్ కేసు నమోదు చేయగా, ఈ ఇష్యూను జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. ఇప్పటికే అరవ శ్రీధర్ వ్యవహారం జనసేన పార్టీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన సైతం విచారణకు కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఎమ్మెల్యే శ్రీధర్ తనను వీణ ట్రాప్ చేసి మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. తనపై వీణ బెదిరింపులకు పాల్పడుతోందని తన తల్లితో రిటర్న్ కంప్లైంట్ కూడా ఇప్పించారు.
మరోవైపు వీణ తనను అరవ శ్రీధర్ వాడుకుని మోసం చేశాడని చెబుతోంది. అతడితో చేసిన చాటింగ్, వీడియో కాల్స్ రికార్డింగ్ లను బయటపెడుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో ఉన్న సమయంలోనూ వీరిద్దరూ వీడియో కాల్ మాట్లాడుకోవడం సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. సభకు ఉన్న గౌరవాన్ని పొగొట్టేలా అరవ శ్రీధర్ వ్యవహరించారని, చరిత్రలో ఇలా జరగటం మొదటిసారి అంటూ మండిపడుతోంది. ఇక ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించడంతో కేసులో ఎలాంటి ములపులు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.






