బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందన ఇదే...!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-14 08:21:14  IST  )

బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు....

బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం..  ఏపీ  సీఎం చంద్రబాబు స్పందన ఇదే...!
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ ఎన్నికల్లో(Bihar Election) దాదాపు బీజేపీ(Bjp) కూటమి విజయం ఖరారైనట్లే. దాదాపు 200 స్థానాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు ముందజలో ఉన్నారు. 243 జరిగిన స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి.. కాంగ్రెస్(Congress) కూటమి పార్టీ అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోటీ జరిగింది. బీహార్ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఓటింగ్ పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. బీజేపీ కూటమి అభ్యర్థులు 200 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు 35 స్థానాల్లో అధిక్యం కనబర్చుతున్నారు. ఈ మేరకు బీజేపీ కూటమి విజయం ఖాయమనే క్లారిటీ వచ్చేసింది. దీంతో బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Chandrababu), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) సైతం బీజేపీ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. బీజేపీ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి దూసుకుపోతున్నాయని, ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు భారీ పరిశ్రమలు కూడా వస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Next Story