- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోకేశ్ బాటలో జగన్.. రెడ్ బుక్ మాదిరిగా వైసీపీ డిజిటల్ బుక్ యాప్
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ(Ycp) విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm jagan Mohan Reddy) అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు(YCP Digital Book App) పాల్గొన్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో జగన్ చర్చించారు. అనంతరం వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌ను లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న వైసీపీ కార్యకర్తల కోసమే ఈ డిజిటల్ బుక్ అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులు, అధికార పార్టీ నాయలకు వేధింపులు, స్థానిక సమస్యలను ఈ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Digitalbook.weysrcp.com పేరుతో పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ నాయకులు ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా https://digitalbook.weysrcp.com/auth/phoneలో నమోదు చేయొచ్చని చెప్పారు. వెబ్ సైట్‌తో పాటు 040-4917171ద్వారా ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, కార్మికులు, ఎవరైనా సరే ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. పోర్టల్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయలేకపోతే క్యూ ఆర్ కోడ్ ఓపెన్ చేసి చేయొచ్చని జగన్ స్పష్టం చేశారు.
కాగా గతంలో నారా లోకేశ్ రెడ్ బుక్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌నుతీసుకొచ్చారంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లోకేశ్ రెడ్ బుక్ కంటే చాలా స్ట్రాంగ్ అంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి వార్నింగ్ ఇస్తున్నారు.






