- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు పుట్టపర్తికి విచ్చేయనున్న రాష్ట్రపతి
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో (Puttaparthi) జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Of India) హాజరుకానున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో (Puttaparthi) జరుగుతున్న సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Of India) హాజరుకానున్నారు. నేడు తిరుపతి పర్యటనను ముగించుకొని హైదరాబాద్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి రాజ్ భవన్ వెళ్లి మధ్యాహ్న భోజనం తరువాత రాజ్ భవనులో విశ్రాంతి తీసుకోనున్నారు. మధ్యామ్నం 3.50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. అనంతరం 4 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే భారతీయ కళా మహోత్సవాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. సాయంత్రం 6.15 గంటలకు తిరిగి రాజ్ భవన్ కు చేరుకుంటారు. అక్కడే బస చేసి మరుసటి రోజైన శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి బయలుదేరి వెళ్లనున్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండనున్నారు. ఉత్సవాలకు హాజరైన అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.






