- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srishailam : శ్రీశైలం ఘాట్ లో భారీగా ట్రాఫిక్ జాం
శ్రీశైలం ఘాట్ రోడ్డు(Srishailam Ghat Road)లో భారీ ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం ఘాట్ రోడ్డు(Srishailam Ghat Road)లో భారీ ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడింది. ఆదివారం కావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రాగా ఘాట్ రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవులు రావడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది భక్తులు తరలి వచ్చారు. దీంతో శ్రీశైలం టోల్ గేట్ నుండి సాక్షి గణపతి ముఖద్వారం వరకు సుమారు 5 కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, ముందస్తు ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలు లేకపోవడం వలన భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడిందని పలువురు భక్తులు ఆరోపించారు. అయితే ఘట్ రోడ్డులో ఓవర్‌లోడ్ ఇసుక లారీ ఓ మలుపు వద్ద నిలిచిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘాట్ రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండటం వల్ల ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, రోడ్డు విస్తరణ లేదా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి చర్యలు అవసరమని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా గతేడాది నవంబర్లో కూడా ఇలాంటి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడి 5 కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.






