అమరావతిలో ప్రపంచస్థాయి అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. నారా లోకేష్

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యాధునిక అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణం వేగంగా కొనసాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

అమరావతిలో ప్రపంచస్థాయి అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.. నారా లోకేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యాధునిక అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణం వేగంగా కొనసాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దశలవారీగా కీలక వసతుల నిర్మాణాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏర్పాటుతో నగర భద్రతా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని లోకేష్‌ వివరించారు. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లను భూగర్భంలోకి మార్చడం వలన అవాంతరాలు తగ్గి, వ్యవస్థపై నమ్మకంతో పాటు నగర సౌందర్యం కూడా పెరుగుతుందని తెలిపారు. ‘ప్రపంచ స్థాయి అండర్‌గ్రౌండ్‌ పవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇది అమరావతికి మరింత విశ్వసనీయత, భద్రత, అందాన్ని అందిస్తుంది. భవిష్యత్‌ తరాలకు నిలబడేలా రాజధానిని రూపుదిద్దుతున్నాం’ అని లోకేష్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. పోస్ట్ ఇదే..

Next Story