- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవనన్న జిజ్ఞాస అద్భుతం.. మార్షల్ ఆర్ట్స్ బిరుదుపై నారా లోకేష్ ట్వీట్
పవన్ ను మంత్రి లోకేష్ అభినందించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం అని కొనియాడారు.

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందారు. దీంతో గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ఇండియన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో పవన్ ను మంత్రి లోకేష్ అభినందించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం అని కొనియాడారు. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారని అన్నారు.
రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారని, సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారని అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి అంటూ లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్, లోకేష్ మధ్య అనుబంధం మరింత పెరిగింది. లోకేష్ అనేక సందర్భాల్లో పవన్ తనకు అన్నలాంటి వాడు అని చెప్పుకొచ్చారు. పవన్ సైతం లోకేష్ పై అంతే ప్రేమను చూపిస్తున్నారు.






