- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు రెండు కళ్లు ఏపీపైనే...తెలుగు భాషపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు రెండు కళ్లు ఏపీపైనే అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సౌత్ కాంకేవ్ 2025 ఏపీ

దిశ, వెబ్ డెస్క్ : చంద్రబాబు రెండు కళ్లు ఏపీపైనే అంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే సౌత్ కాంకేవ్ 2025 ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు నారా లోకేష్. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుందని.. కీలక ప్రకటన చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు తమ మద్దతు ఉంటుందని వివరించారు.
దేశ రాజకీయాల్లోకి చంద్రబాబు రావడంపై నారా లోకేష్ క్లారిటీ
దేశ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు వస్తారా? అని ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్రశ్నించారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ... ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రెండు కళ్ళు కూడా ఏపీ పైనే ఉన్నాయని తెలిపారు. ఏపీ ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఏపీని అభివృద్ధి చేసిన తర్వాతే.. ఏదైనా అని వివరించారు.
నూతన జాతీయ విద్యా విధానంపై రియాక్ట్
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంపై కూడా నారా లోకేష్ ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ నూతన విద్యా విధానాన్ని సమర్థిస్తున్నట్లు వెల్లడించారు. నూతన విద్యా విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని చెబుతున్నప్పటికీ కూడా... హిందీని ఎక్కడ తప్పనిసరి చేయలేదని నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. తాను మూడు భాషలు నేర్చుకున్నానని... తన కొడుకు కూడా త్వరలో నేర్చుకుంటాడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో మాతృభాష తెలుగును తాము గౌరవిస్తామని చెప్పుకొచ్చారు.
2029 తర్వాత కూడా మోడీ తోనే ప్రయాణం
ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్తారా అని ఓ జర్నలిస్టు అడగగా... దానికి చాలా సున్నితంగా ఆన్సర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. 2029 వరకు... బిజెపితో తమ ప్రయాణం కొనసాగుతుందని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కూడా బిజెపితోనే నడుస్తామని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో ఏపీకి కావాల్సిన నిధులను... సాధిస్తామని కూడా తెలిపారు.
ఏపీ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
చంద్రబాబు నాయకత్వంలో... స్కిల్ డెవలప్మెంట్ పైన దృష్టి పెడతామని వెల్లడించారు. కుల గనన కంటే నైపుణ్య గణన ఎంతో ముఖ్యమన్నారు. యువతలో టాలెంట్ గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచి మంచి పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా... యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు సాధించేలా చర్యలు చేపడతామన్నారు.






