Nara Lokesh: చిన్నాన్న మాకు కంటికి క‌నిపించే ధైర్యం.. మంత్రి నారా లోకేష్

by Ramesh Goud |   (  Updated:2024-11-16 11:08:16  IST  )

సీఎం చంద్రబాబు(CM Chandrababu) సొదరుడు నారా రామ్మూర్తి నాయుడు(Nara Rammurthi naidu) ఐఏజీ ఆసుపత్రి(AIG Hospital)లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Nara Lokesh: చిన్నాన్న మాకు కంటికి క‌నిపించే ధైర్యం.. మంత్రి నారా లోకేష్
X

దిశ, వెడ్ డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) సొదరుడు నారా రామ్మూర్తి నాయుడు(Nara Rammurthi naidu) ఐఏజీ ఆసుపత్రి(AIG Hospital)లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. ఈ నేపధ్యంలోనే బాబాయ్ మృతి పట్ల మంత్రి నారా లోకేష్(Lokesh Nara) స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాబాయ్ రామ్మూర్తి నాయుడుని స్మరిస్తూ.. భావోద్వేగబరిత పోస్ట్ పెట్టారు. ఇందులో.. చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదం నింపిందని, చిన్నాన్న‌తో చిన‌్ననాటి నా అనుబంధం క‌ళ్ల ముందు క‌దిలి వ‌చ్చిన క‌న్నీటితో నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. అలాగే మౌన‌మునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి క‌నిపించే ధైర్యం అని, నేటి నుంచి చిర‌కాల జ్ఞాప‌కం అని చెప్పారు. ఇక చిన్నాన్న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని, అంతులేని దుఃఖంలో ఉన్న త‌మ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాల‌ని కోరారు.

Next Story