విద్యాశాఖ రాజకీయాలకు అతీతంగా ఉండాలి: నారాలోకేష్

by Ajay Maddhiboyina |

విద్యాశాఖ రాజకీయాల‌కు అతీతంగా ఉండాల‌ని మంత్రి నారాలోకేష్ అన్నారు. గ‌తంలో పుస్త‌కాల ద‌గ్గ‌ర నుండి అన్నింటిపై ఫోటోలు వేసుకున్నార‌ని విమ‌ర్శించారు.

విద్యాశాఖ రాజకీయాలకు అతీతంగా ఉండాలి: నారాలోకేష్
X

దిశ‌, వెబ్ డెస్క్: విద్యాశాఖ రాజకీయాల‌కు అతీతంగా ఉండాల‌ని మంత్రి నారాలోకేష్ అన్నారు. గ‌తంలో పుస్త‌కాల ద‌గ్గ‌ర నుండి అన్నింటిపై ఫోటోలు వేసుకున్నార‌ని విమ‌ర్శించారు. చిక్కీ ద‌గ్గ‌ర నుండి ప్ర‌తి వ‌స్తువుపై పిచ్చిబొమ్మ‌లు వేశార‌న్నారు. రంగుల పిచ్చితో విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత విద్యార్థుల‌కు స‌న్న‌బియ్యం పెడుతున్నామ‌ని చెప్పారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌ని, అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం దేవుడిత‌రం కూడా కాద‌ని అన్నారు.

జూన్ 4న గెలిచింది కూట‌మి పార్టీలు కాద‌ని, ప్ర‌జ‌లని అన్నారు. గ‌త పాల‌న‌లో విధ్వంసాన్ని చూశామ‌ని మండిప‌డ్డారు. వైసీపీ హయాంలో కంపెనీల‌ను త‌రిమేశార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయ‌లేద‌ని విమ‌ర్శించారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే అన్నా క్యాంటీన్లు తెరిచామ‌ని, మెగా డీఎస్సీకి నోటిఫికేష‌న్ ఇచ్చామ‌ని అన్నారు. తొమ్మిదివేల పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం అమలులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఉద్యోగుల కోసం జీవో 117 రద్దు చేశామన్నారు. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని ఒక్కొక్కటికీ చేసుకుంటూ వెళుతున్నామని చెప్పారు.

Next Story