త్వరలోనే ఆ పోస్టులన్నీ భర్తీ : నారా లోకేష్

by Muthe.Rajitha |

తెలుగుదేశం పార్టీలో పెండింగ్‌లో ఉన్న అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి, ఆ పార్టీ జాతీయ సెక్రెటరీ నారా లోకేష్ పేర్కొన్నారు.

త్వరలోనే ఆ పోస్టులన్నీ భర్తీ : నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీలో పెండింగ్‌లో ఉన్న అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి, ఆ పార్టీ జాతీయ సెక్రెటరీ నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్‌ కో ఆర్డినేటర్లతో నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే అధికారంలోనూ జోనల్‌ కోఆర్డినేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని, అధికారంలోకి వచ్చామని నిర్లక్ష్యంతో ఉండకూడదని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కోఆర్డినేటర్లదే అని స్పష్టం చేశారు. పార్టీకి అన్నీ తామై వ్యవహరించాలని జోనల్‌ కోఆర్డినేటర్లకు సూచించారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇంచార్జి స్థానాల్లో కొత్తవారిని త్వరలోనే నియమిస్తామని నారా లోకేశ్‌ తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని సూచించారు.

Next Story