నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక పురస్కారం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హర్షం

by Ramesh Naini |

ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్‌ అందించే పత్రిష్టాత్మక పురస్కారం ‘అవుట్‌ స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025’ను హెరిటేజ్‌ సంస్థకు లభించింది.

నారా భువనేశ్వరికి ప్రతిష్టాత్మక పురస్కారం.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్‌ అందించే పత్రిష్టాత్మక పురస్కారం ‘అవుట్‌ స్టాండింగ్‌ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025’ను హెరిటేజ్‌ సంస్థకు లభించింది. ఈ సందర్భంగా హెరిటేజ్‌ సీఎండీ, ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరికి ఇండియన్‌ డెయిరీ అసోసియేషన్‌ ప్రతినిధులు ఈ అవార్డును అందజేశారు. పాడి రైతుల సాధికారత, డెయిరీ ఎకో సిస్టమ్ అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. రైతుల సహకారం, హెరిటేజ్‌ బృందం కృషితోనే అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా భువనేశ్వరి వెల్లడించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హర్షం

నారా భువనేశ్వరి ఈ అవార్డు అందుకోవడంపై పలు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు విషెస్ తెలిపారు. కంట్రాగ్స్ అమ్మ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అలాగే ఏపీ సీఎం ట్వీట్ చేస్తూ.. పాడి రైతుల సంక్షేమం, మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు రావడం పట్ల గర్వంగా ఉందని, ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్‌లోని వేలాది మంది పాడి రైతుల కష్టం దాగి ఉందని ట్వీట్‌లో సీఎం పేర్కొన్నారు.

Next Story