- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. లండన్ లో జరిగిన కార్యాక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ఈ అవార్డులను అందజేసింది. ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఇటీవలే నారా భువనేశ్వరితో పాటు హెరిటేజ్ సంస్థకు రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించారు. అంకిత భావం, నైతిక నాయకత్వం, సుపరిపాలన, సామాజిక ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు ఐఓడీ పేర్కొంది.
లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటరులో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు సమేతంగా నారా భువనేశ్వరి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నారా భువనేశ్వరికి (Nara Bhuvaneshwari) డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025 అవార్డును అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక సాధికారత రంగాల్లో విశేష సేవలకు గానూ ఈ అవార్డును అందుకున్నారు. అదే విధంగా కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు వచ్చిన గోల్డెన్ పీకాక్ అవార్డును నారా భువనేశ్వరి స్వీకరించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ శుభాకాంక్షలను తెలియజేశారు.






