ప్రసన్నకుమార్ వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం

by Ajay Maddhiboyina |

కోవూరు ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ అస‌భ్య‌క‌రంగా కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్రసన్నకుమార్ వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం
X

దిశ‌, వెబ్ డెస్క్: కోవూరు ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ అస‌భ్య‌క‌రంగా కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కూట‌మి నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎస్పీకి, మ‌హిళా క‌మిష‌న్‌కు ప్రసన్న కుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా ఆయన వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటు అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు సమాజంలో చోటు లేదన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని అందరూ తిరస్కరించాలని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి సంఘీభావం ప్రకటిస్తున్నానని అన్నారు. మహిళల పట్ల అవమానకర మాటలు వారి విలువను తగ్గించలేవని పేర్కొన్నారు. స్త్రీల గౌరవాన్ని దెబ్బతీసే ఏ వ్యాఖ్యలనైనా ఖండించాల్సిందేనని అన్నారు. మహిళలకు మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతామని చెప్పారు.

Next Story