జగన్ కు నక్కా ఆనంద్ బాబు కౌంటర్..సినిమా డైలాగ్స్ ఉండాల్సిందే !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Ys Jagan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టిడిపి సీనియర్ నాయకు

జగన్ కు నక్కా ఆనంద్ బాబు కౌంటర్..సినిమా డైలాగ్స్ ఉండాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Ys Jagan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టిడిపి సీనియర్ నాయకులు నక్క ఆనంద్ బాబు (Nakka Anand Babu). సినిమాలో డైలాగులు అలాగే సన్నివేశాలు కచ్చితంగా ఉంటాయని... అవి కేవలం వినోదం కోసం మాత్రమేనని... చురకలు అంటించారు. సినిమాలో హత్యలు, ఆత్మహత్యలు, ఆందోళనలు అలాగే అలజడులు కూడా ఉంటాయని గుర్తు చేశారు. వాటిని చూసి బయట కూడా అలాగే చేయాలని... చెప్పడానికి సిగ్గు లేదా ? అంటూ నిలదీశారు.

ఇవాళ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా డైలాగులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. సినిమా డైలాగులు పోస్టర్ల మీద వాడినందుకు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డ్ పర్మిషన్ ఎందుకు ఇచ్చిందని నిలదీశారు.

అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే నందమూరి బాలయ్య సినిమాలో దారుణంగా డైలాగులు ఉంటాయని గుర్తు చేశారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలకు నక్క ఆనంద్ బాబు కౌంటర్ ఇచ్చారు. సినిమా డైలాగులు వినోదం కోసం మాత్రమే ఉంటాయని చురకలు అంటించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్... సమాజానికి ఏం నేర్పించాలని అనుకుంటున్నాడని నిలదీశారు నక్క ఆనంద్ బాబు.

Next Story