Minister Rojaపై Nagababu సంచలన వ్యాఖ్యలు(వీడియో)

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-23 05:55:49  IST  )

ఏపీ మంత్రి రోజాపై నాగబాబు ఫైర్ అయ్యారు.

Minister Rojaపై Nagababu సంచలన వ్యాఖ్యలు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి రోజాపై జనసేన నాయకుడు నాగబాబు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. రోజా నోరు మున్సిపాలిటీ చెత్తకుప్ప అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిరంజీవి, పవన్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పిచ్చి మాటలు ఆపి ఇప్పటికైనా పని చూసుకోవాలన్నారు. నువ్వు పర్యటనలు చేస్తే అది పర్యాటక శాఖ అవుతుందా అని మండి పడ్డారు. పర్యాటక రంగంలో ఏపీ 18 వ స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. రోజా మంత్రి పదవి ముగిసేలోగా 20వ స్థానానికి వెళ్తాం అన్నారు. గతంలో అనేక మార్లు విమర్శించిన స్పందించలేదని ఇప్పటికైనా మారకపోతే బుద్ధి చెప్పాల్సి వస్తుందన్నారు. ఈనెల 5 న రోజా మాట్లాడుతూ ముగ్గురు అన్నదమ్ములు సొంత నియోజకవర్గాలకు ఏమీ చేయలేదు కాబట్టే జనం ఓడించారని చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబును ఉద్దేశించి కామెంట్ చేశారు.

Also Read...

సీఎం జగన్‌కు 'Veera Simha Reddy' స్ట్రాంగ్ కౌంటర్! (వీడియో)

Next Story