Nadendla Manohar: మార్క్ శంకర్‌కు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది: నాదేండ్ల

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-08 11:51:29  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.

Nadendla Manohar: మార్క్ శంకర్‌కు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది: నాదేండ్ల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pavanovich) సింగపూర్‌లో (Singapore) చదువుతున్న స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (AP Minister Nadendla Manohar) స్పందించారు. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు ఆరోగ్య నిలకగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. ప్రమాదంపై పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని తెలిపారు. అలాగే అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారన్నారు.

కాగా, సోమవారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. స్కూల్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం. ఇక ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, అల్లూరి జిల్లాలో అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటిన సింగపూర్ బయలుదేరారు. ప్రమాదం గురించి తెలిపిన పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సానుభూతిపరులు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

Next Story