Nara Lokesh: నా లక్ష్య్ం ఒక్కటే.. మంత్రి నారా లోకేశ్​

by Thanuru Gopichand |

మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో టాప్​లో నిలబెట్టడమే తన లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్తె లిపారు.

Nara Lokesh: నా లక్ష్య్ం ఒక్కటే.. మంత్రి నారా లోకేశ్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో : మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో టాప్​లో నిలబెట్టడమే తన లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్​(Nara Lokesh) తెలిపారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని (Mangalagiri)డాన్​బాస్కో స్కూలు వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్​ మాట్లాడుతూ ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగిందన్నారు. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని అనుకున్నానని, ఇక్కడ 24 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశానని తెలిపారు. ఉచితంగా నీరు అందించాం ముబైల్​ఆస్పత్రులను ఏర్పాటు చేశాను, కుట్టు మిషన్లు అందజేశాను.. అని తెలిపారు. తన మంగళగిరి గెలుపుపై కొంతమంది డౌటు వ్యక్తం చేశారని, రెండో చోట పోటీ చేయమని సూచించారని తెలిపారు. కానీ మంగళగిరిలోనే పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో మీకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చా.. దానిని నెరవేర్చానని లోకేశ్​ తెలిపారు. మంగళగిరి పట్టణంలో 3000 మందికి పట్టాలిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబేయో రోజుల్లో పోలీసు స్టేషన్​అభివృద్ధి చేస్తున్నాం.. పార్కులు అభివృద్ధి చేస్తన్నామని తెలిపారు. అవినీతి లేకుండా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని ఇస్తున్నామని తెలిపారు. మంగళగిరి ప్రజలన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షోరూమ్ ను లోకేష్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొలిగా మంగళగిరి చేనేత చీరను (Handlooms) కొనుగోలు చేసి చేనేతల పట్ల తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానికీదేవి తదితరులు పాల్గొన్నారు.

Next Story