- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణ

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలోనే ఏపీకి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిని నియమించింది. సీనియర్ అధికారి ముద్దాడ రవిచంద్రను చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా అపాయింట్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన అధికారులను ప్రభుత్వం ఎన్నికల ఫలితాల అనంతరం బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎంవో ఖాళీ అయ్యింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో తాజాగా సీఎంవోలో అధికారులను నియమిస్తున్నారు.
Next Story






