- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది నా అదృష్టం: ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమేనని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు....

దిశ. నందికొట్కూరు: అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమేనని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. దేశంలోనే టాప్ 3లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారని ఆమె తెలిపారు. ఆనాడు హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో నేటికీ అక్కడి ప్రజలు సీఎం చంద్రబాబు గురించే మాట్లాడు కుంటున్నారని, చంద్రబాబు నాయకత్వంలో తాను ఎంపీగా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం తూర్పు, పరమట ప్రాతకోట గ్రామాల్లో, మిడ్తూరు మండలం కడుమూరు గ్రామాల్లో ఎంపీ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ఫ్లాంట్లు ప్రారంభించి, అర్హులకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన ఇప్పటికి ప్రజలు సిమెంట్ రోడ్లు, తాగునీటి కుళాయిలు, రక్షత మంచి నీటి ఓవర్ హెడ్ ట్యాంకులు, రైతులకు ఉపయోగపడే ఆయకట్టు రోడ్లు, చెక్ డ్యామ్ లు, కొత్త చెరువుల నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు, సాగునీరు, తాగునీరు అందించిన అప్పటి ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మధ్యలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమీ అభివృద్ధి చేయలేదని, గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని నియోజకవర్గం ప్రజలే చెబుతున్నారన్నారు. ఆనాడు సీఎం చంద్రబాబు నాయకుడు హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు కాబట్టే నేటికీ అక్కడి ప్రజలు చంద్రబాబును గుర్తుపెట్టుకొని ఆయన సేవలను కొనియాడుతున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.సీఎం చంద్రబాబును చూసి ఎంతో నేర్చుకోవాల్చి ఉందన్నారు.
రాష్ట్రం రైతులకు సాగునీరు అందిస్తూ పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తున్నారని, మహిళా పక్షపతిగా సీఎం చంద్రబాబు ఇంట్లో చదువుకుంటున్న విద్యార్థులందరికి తల్లికివందనం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఆర్‌టీసిలో స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం, ఒంటరి మహిళా, వృద్ధులు, వితంతు, దివ్యాంగులు తదితర అర్హులైన వారందరికీ ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్ అందిస్తూ ఆ కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. మరో 30 ఏళ్లు రాష్ట్రం ఉమ్మడి ప్రభుత్వం కొనసాగేలా ప్రజలు దీవించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, పగిడ్యాల తహసీల్దార్ శివరాముడు, ఎంపీడీఓ సుమిత్రమ్మ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ ఈ శివకుమార్, మిడ్తూరు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎం పి డి ఓ రామయ్య, ఆర్ డబ్ల్యూ ఎస్ డి ఈ ఇగ్బాల్, ఈ ఓ ఆర్ డి సంజన్న, కడుమూరు సర్పంచ్ రత్నమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి, భగీరథ రెడ్డి, సీతారామిరెడ్డి, స్వామిరెడ్డి, రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ నాగేశ్వరావు, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ మెంబర్ కురువ రమేష్, కె. శ్రీనివాసనాయకుడు, రామానాయకుడు, పైడిపాలెం నాగేశ్వరావు, నాగశేషులు, దశరథ రామిరెడ్డి, అల్లి ఉసెన్ తదితరులు పాల్గొన్నారు.






