భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే: జగన్ కు కేశినేని కౌంటర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-09 09:26:20  IST  )

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకొచ్చింది తామేనని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఖండించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించిన ఘనత మా ప్రభుత్వానిదే: జగన్ కు కేశినేని కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకొచ్చింది తామేనని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఖండించారు. భోగాపురం ఎయిర్ పోర్టును నిర్మించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి సర్కార్ ఆపేసిందని జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆ ప్రాజెక్టును అటకెక్కించింది జగన్ ప్రభుత్వమేనని కేశినేని చిన్ని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు ఇంకా జగన్ మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసి అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం ఆయనకు మింగుడు పడటం లేదని విమర్శించారు. అమరావతి, విశాఖ, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, మరో పాతికేళ్లపాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. చరిత్రలో అత్యంత హీనంగా వైఎస్సార్సీపీ ఓడిపోయిందని విమర్శించారు.

Next Story