కొత్త వాహనాలపై మరింత రోడ్ సేఫ్టీ సెస్ బాదుడు

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త వాహనాలపై మరింత రోడ్ సేఫ్టీ సెస్ బాదుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. లైఫ్‌టైమ్ ట్యాక్స్ ఉన్న మోటార్ వాహనాలపై ఈ 10% సెస్ వసూలు చేయనున్నారు. రాష్ట్రంలో నెలకు సుమారు 73 వేల కొత్త వాహనాలు నమోదు అవుతున్న నేపథ్యంలో నెలకు రూ.22.5 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.270 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేసి రోడ్ల అభివృద్ధి, భద్రతా చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. కేంద్రం వాహనాలపై జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలో ఈ సెస్ వల్ల వాహన యజమానులపై భారం పెద్దగా ఉండదని ప్రభుత్వం చెబుతోంది.

Next Story