- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్‌కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' బిరుదు.. అభినందించిన మోడీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లోని కెన్జుట్సులో అధికారిక ప్రవేశం పొందడంపై ప్రధాని మోడీ అభినందించారు. ఈ మేరకు మోడీ ఓ అభినందన లేఖను పవన్ కల్యాణ్ కు పంపించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లోని కెన్జుట్సులో అధికారిక ప్రవేశం పొందడంపై ప్రధాని మోడీ అభినందించారు. ఈ మేరకు మోడీ ఓ అభినందన లేఖను పవన్ కల్యాణ్ కు పంపించారు. మార్షల్ ఆర్ట్స్ లో అరుదైన గుర్తింపు రావడంపై అభినందించారు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా, ప్రజా జీవితంలోనూ బిజీగా ఉన్నా ఎంతో క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం గొప్పవిషయం అని మోడీ పేర్కొన్నారు. దశాబ్దాల కాలం నుండి మార్షల్ లో శిక్షణ పొందడం గ్రేట్ అన్నారు. తన డెడికేషన్ తో పవన్ యువతరానికి ఓ మెసేజ్ ఇచ్చారని తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కేవలం శారీరకంగా ధృండగా ఉండటమే కాక మానసికంగానూ చాలా స్ట్రాంగ్ అవుతారని పేర్కొన్నారు. ఫిట్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్న సమయంలో నాయకులు ఇలా రోల్ మోడల్ గా నిలవడం గొప్పవిషయం అన్నారు. ఇక ప్రధాని రాసిన లేఖకు పవన్ ఎక్స్ వేధికగా కృతజ్ఞతలు తెలిపారు. మీ స్పూర్తితోనే ఈ ప్రయాణం సాధ్యమైందని పేర్కొన్నారు.






