- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనసేన ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జనసేన అధినేతకు సూచించారు. మంగళవారం వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుంచి మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారని, మహిళల జీవితాలతో అడుకుంటున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తప్పుడు పనులు చేసే వారికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రాప్తాడులో పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు లైంగిన దాడి చేస్తే కేసు లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడని, కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదు సార్లు అబార్షన్ చేయించాడని, లొంగకపోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా? మహిళపై చేయి వేస్తే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారని నిలదీశారు.
READ MORE .....






