దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లడం దారుణం : దువ్వాడ శ్రీనివాస్

by Naga Rani Yarlagadda |

చట్టసభల్లోకి దేవుడి ఫొటోలను తీసుకుని రావడం దారుణమైన విషయమన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.

దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లడం దారుణం : దువ్వాడ శ్రీనివాస్
X

దిశ, వెబ్‌డెస్క్: శాసనమండలి సభలోకి వైసీపీ ఎమ్మెల్సీలు వేంకటేశ్వరస్వామి ఫొటోలతో రావడం గందరగోళానికి దారి తీసింది. చెప్పులు వేసుకుని దేవుడిని సభలోకి తీసుకురావడమే కుకండా.. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సబబు కాదని కూటమి మంత్రులు మండిపడ్డారు. మండలి వాయిదా అనంతరం దేవుడి ఫొటోలను అక్కడే పడేసి వెళ్లిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఇందుకు హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, నారా లోకేశ్, చైర్మన్ మోషేను రాజు తదితరులు డిమాండ్ చేశారు.

తాజాగా ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. జగన్ అంటే తనకూ ఎంతో అభిమానం ఉందన్నారు. కానీ ఇలా దేవుడి ఫొటోలను చట్టసభల్లోకి తీసుకురావడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. మతపరమైన అంశాలను చట్టసభల్లోకి తీసుకురావడం దారుణమైన అంశమని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు బడ్జెట్ పై చర్చ జరగనివ్వకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎవరి ట్రాప్ లో ఎవరు పడుతున్నారో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ మారే అంశంపై దువ్వాడ కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో ప్రస్తుతం బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని, పార్టీ మారే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

Next Story