- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిని మేం అలానే చూస్తాం: మరోసారి బొత్స సెన్సేషనల్ కామెంట్స్
అమరావతి కేవలం తమకు శాసన రాజధాని మాత్రమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati) కేవలం తమకు శాసన రాజధాని మాత్రమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతి కోసమే రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి పేరుతో జరిగే అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని, అమరావతికి కాదని ఆయన వివరించారు. అయితే అమరావతి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో తాము ప్రత్యామ్నాయంపై ఆలోచించాల్సి ఉంటుందని బొత్స వ్యాఖ్యానించారు.
కాగా గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అమరావతిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బొత్స చేసిన వ్యాఖ్యలు రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్‌ను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. నిధుల వ్యయంపై ఆయన ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందుకు కూటమి నాయకుల నుంచి ఎలాంటి సమాధానాలొస్తాయో చూడాలి.






