దమ్ముంటే నిరూపించండి: ప్రభుత్వానికి ఎమ్మెల్సీ బొత్స సవాల్

by Vemula.Srinu Prasad |

ప్రభుత్వం ఒత్తిడితోనే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు....

దమ్ముంటే నిరూపించండి: ప్రభుత్వానికి ఎమ్మెల్సీ బొత్స సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం ఒత్తిడితోనే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana) అన్నారు. పరకామణి కేసులో కీలకంగా ఉన్న ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సతీశ్ మృతిపై రాజకీయం దుమారం చెలరేగింది. పరకామణి కేసులో సతీశ్ కీలకంగా ఉన్నారని, ఆధారాలు బయట పెడతాడనే ఆయన్ను చంపేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు సతీశ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమంటూ వ్యాఖ్యానించారు. విచారణ పేరుతో సతీశ్‌పై అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్నారని అన్నందుకే కారుమూరిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా అని నిలదీశారు. దమ్ముంటే సతీశ్‌ది హత్య అని నిరూపించాలని బొత్స సవాల్ విసిరారు.

Next Story