మరోసారి తెరపైకి వివేకా హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-09 12:36:27  IST  )

వైఎస్ వివేకానందారెడ్డి హత్యపై ఎమ్మెల్సీ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు...

మరోసారి  తెరపైకి వివేకా హత్య కేసు.. వైసీపీ ఎమ్మెల్సీ  సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వివేకానందారెడ్డి హత్య(Vivekananda Reddy Murder) కేసు మరోసారి సంచలనంగా మారింది. వివేకా హత్య కేసులో న్యాయం కోసం ఇంకెన్నాళ్లు తిరగాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత(Ys Sunitha) రెండు రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. దీంతో వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మళ్లీ మాటలయుద్ధం కొనసాగుతోంది. వివేకా హత్యపై వైసీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. అయితే ఇందుకు వైసీపీ నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలోనే వివేకా హత్య జరిగిందని, అయితే అప్పుడే సీబీఐకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి అయిన తర్వాతే వివేకా కేసును సీబీఐకు అప్పగించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు అవుతోందని, వివేకా హత్యకు సంబంధించి ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలని బొత్స సూచించారు. విశాఖలో టీడీపీ నేతలు భూదోపిడీకి పాల్పడుతున్నారని, త్వరలోనే నిలదీస్తామని బొత్స హెచ్చరించారు.

Next Story