'అఖండ-2' ప్రీమియర్ షో.. థియేటర్‌లో ఎమ్మెల్యేల డ్యాన్స్

by Ajay Maddhiboyina |

నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమా ప్రీమియ‌ర్ షోలు గురువారం థియేట‌ర్ల‌లో వేశారు. దీంతో థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం క‌నిపించింది.

అఖండ-2 ప్రీమియర్ షో.. థియేటర్‌లో ఎమ్మెల్యేల డ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమా ప్రీమియ‌ర్ షోలు గురువారం థియేట‌ర్ల‌లో వేశారు. దీంతో థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం క‌నిపించింది. చాలా చోట్ల అభిమానులు సినిమా విడుద‌ల‌ను ఉత్స‌వంలా జ‌రుపుకుంటున్నారు. ఇక చిత్తూరులో ప్రీమియ‌ర్ షో చూసిన అనంత‌రం ఇద్ద‌రు ఎమ్మెల్యేలు థియేట‌ర్ లోనే డ్యాన్సులు చేశారు.

చిత్తూరు ఎమ్మెల్యే గుర‌జాల జ‌గ‌న్ మోహ‌న్, పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే ముర‌ళీ మోహ‌న్ డ్యాన్స్ చేయ‌గా అభిమానులు, కార్య‌క‌ర్తలు సైతం వారితో క‌లిసి స్టెప్పులు వేశారు. ఇదిలా ఉంటే అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ పార్ట్ 2 తెరకెక్కించారు. సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేశారు. సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటించగా ముందు నుండి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాకు మాత్రం ట్విట్టర్ లో మిక్స్డ్ టాక్ వస్తోంది. VIDEO

Next Story