కాపు సంఘం సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

టీడీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. త‌న చిన్న‌త‌నంలో చిన్న క‌మ్మ‌వాళ్లు అంటే కాపులు అని అన్నారు. పెద్ద క‌మ్మోళ్లు అంటే అస‌లైన క‌మ్మ‌వాళ్లు అని చెప్పేవార‌న్నారు. పొలాలు త‌క్కువ ఉన్న వాళ్ల‌ను కాపులు అని, ఎక్కువ ఉన్న‌వాళ్ల‌ని క‌మ్మ‌లు అని పిలిచేవార‌న్నారు.

కాపు సంఘం సమావేశంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. త‌న చిన్న‌త‌నంలో చిన్న క‌మ్మ‌వాళ్లు అంటే కాపులు అని అన్నారు. పెద్ద క‌మ్మోళ్లు అంటే అస‌లైన క‌మ్మ‌వాళ్లు అని చెప్పేవార‌న్నారు. పొలాలు త‌క్కువ ఉన్న వాళ్ల‌ను కాపులు అని, ఎక్కువ ఉన్న‌వాళ్ల‌ని క‌మ్మ‌లు అని పిలిచేవార‌న్నారు. అంతే కానీ రెండు కులాల మ‌ధ్య ఎలాంటి వ్యత్యాసం లేద‌ని చెప్పారు.

అన్న‌ద‌మ్ములుగా త‌ర‌త‌రాలు క‌లిసి ఉన్నామ‌ని తెలిపారు. కానీ మ‌ధ్య‌లో కొన్ని రాజ‌కీయాలు దూరం చేశాయ‌ని చెప్పారు. మ‌న బిడ్డ‌లంద‌రినీ క‌లిసి ముందుకు న‌డిపించ‌డం మ‌న బాధ్య‌త అని క‌మ్మ‌లేదు.. కాపు లేదు స‌మైఖ్యంగా ముందుకు ఎద‌గాల‌ని జాతి నిర్మాణంలో పాల్పంచుకోవాల‌న్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఉద‌య‌భాను నియోజ‌క‌వ‌ర్గం నుండి ఎమ్మెల్యే అవుతాడ‌ని చెప్పారు. ఆయ‌న మంత్రి ప‌దవి కూడా చేప‌డతార‌ని జోస్యం చెప్పారు.

Next Story