- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవానీపురం కూల్చివేతలపై సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు
భవానీపురం కూల్చివేతలపై సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada) భవానీపురంలో 42 నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సుజనాచౌదరి(Mla Sujanachowdary)ని బాధితులు కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లారు. ఆయన లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి శనివారం స్పందించారు. జోజినగర్ బాధితుల విషయం ముందే తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లమని చెప్పానని చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే తొలగింపులు జరిగాయన్నారు. బాధితులకు ఎలా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు. మానవత్వంతో తాను స్పందిస్తున్నానని తెలిపారు. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఫేక్ సొసైటీపైనా విచారణ జరపాలని చెప్పామని, వచ్చే శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.






