సిగ్గు, శరం, రాజకీయ లక్షణాలుంటే ఆరోపణలు రుజువు చెయ్.. కాకాణికి సోమిరెడ్డి ఛాలెంజ్

by Naga Rani Yarlagadda |

మాజీమంత్రి కాకాణి గోవర్థన్ చేసిన తనపై చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు.

సిగ్గు, శరం, రాజకీయ లక్షణాలుంటే ఆరోపణలు రుజువు చెయ్.. కాకాణికి సోమిరెడ్డి ఛాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో తాను రూ.100 కోట్లు తినేశానంటూ.. మాజీమంత్రి కాకాణి గోవర్థన్ చేసిన వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. జిల్లాలో ఇరిగేషన్ పనులు జరగకుండానే బిల్లులు వసూలు చేశాననడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకాణికి సిగ్గు, శరం, రాజకీయ లక్షణాలు ఉంటే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఓపెన్ ఛైలెంజ్ చేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. వైసీపీ హయాంలో జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే కోట్ల రూపాయలు తినేశారని ఆరోపించారు.

కండీషన్ బెయిల్ పై ఉన్నావ్.. గుర్తుంచుకో

జగన్ హయాంలో చేసిన అభివృద్ధి పనులేంటో చెప్పాలని తాను బహిరంగ సవాల్ విసిరినందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాకాణి ప్రస్తుతం కండీషన్ బెయిల్ పై ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రోజూ పోలీసు అధికారుల్ని బెదిరించడం, టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడం ఏంటని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖలో రూ.150 కోట్లు తినేసిన కాకాణి.. తనపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు కాకాణి అల్లుడు ఒక కంపెనీకి సీఈఓ అవ్వడం, ఆ కంపెనీ పేరుతో భూములు కొట్టేయడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరితేరిన దొంగల ముఠా అంతా వైసీపీలోనే ఉందని సెటైర్లు వేశారు.

Next Story