శ్రీకాంత్ పెరోల్ కోసం నన్ను కలిసింది వాస్తవమే: ఎమ్మెల్యే సునీల్

by Vemula.Srinu Prasad |

శ్రీకాంత్ పెరోల్ కోసం నన్ను కలిసింది వాస్తవమేనని ఎమ్మెల్యే పాశం సునీల్ ఒప్పుకున్నారు..

శ్రీకాంత్ పెరోల్ కోసం నన్ను కలిసింది వాస్తవమే: ఎమ్మెల్యే సునీల్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)కు చెందిన రౌడీషీటర్ శ్రీకాంత్(Roudy Sheeter Srinkanth) పెరోల్ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ పెరోల్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన అంశాలు సైతం బయటకు వచ్చాయి. దీంతో వారిద్దరి ఎమ్మెల్యే పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రౌడీ షీటర్ కు అండగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు వినిపించాయి.

ఈ నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్(Gudur Mla Pasam Sunil) స్పందించారు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంపై ఆయన స్పష్టత ఇచ్చారు. శ్రీకాంత్ పెరోల్ కోసం తనను కలిసింది నిజమేనని సునీల్ స్పష్టం చేశారు. శ్రీకాంత్ తల్లి అభ్యర్థన మేరకే లేఖ ఇచ్చానని తెలిపారు. తాను ఇచ్చిన లేఖను హోంశాఖ డిస్మిస్ చేసిందని చెప్పారు. అరుణ ఎవరో తనకు తెలియదని.. ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదని పాశం సునీల్ పేర్కొన్నారు

Next Story