2 వేల మందిని తెచ్చుకోండి.. గుడ్డలూడదీసి కొడతాం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

వైసీపీ నేతలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..

2 వేల మందిని తెచ్చుకోండి.. గుడ్డలూడదీసి కొడతాం: ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేతలకు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవరెడ్డి(Mla MadhaviReddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము 200 మందిమి తలుచుకుంటే టీడీపీ(Tdp)ని లేకుండా చేస్తామన్న వైసీపీ నాయకులకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 200 మంది కాకపోతే 2000 మందిని తీసుకోవచ్చని బహిరంగ సవాల్ విసిరారు. తమ నుంచి తప్పించుకుని దాక్కునేందుకు స్థలాలు వెతుక్కోవాలని హెచ్చరించారు. గంజాయి, లిక్కర్, డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారేమో.. కానీ తాము ఒరిజినల్‌ టీడీపీ కార్యకర్తలం వస్తామని ఛాలెంజ్ చేశారు. తాము కడప వాళ్లమని, గుడ్డలూదీ పారిపోయేలా చేయకపోతే మళ్లీ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) పేరు ఎత్తమని ఎమ్మెల్యే మాధవి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story