- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mithun Reddy: నాపై పెట్టిన కేసు నిలబడదు.. ఎంపీ మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్
వైసీపీ (YCP) హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో సిట్ నోటీసులు అందుకున్న ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ఇవాళ విచారణకు హాజరయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో సిట్ నోటీసులు అందుకున్న ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆయన కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడలోని సిట్ (SIT) కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసు ఇది అని.. ఎట్టి పరిస్థితుల్లో ఇది నిలబడదని కామెంట్ చేశారు.
నోటి మాటలతో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొన్నారు. ఈ పరిణామంతో కొందరు తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని.. ధైర్యంగా కేసును ఎదుర్కొంటామని అన్నారు. అదేవిధంగా సిట్‌కు పూర్తిగా సహరిస్తానని తెలిపారు. అయితే, కాసేపట్లో సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి రానుడటంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తారనే సమాచారం మేరకు సిట్ ఆఫీస్ రూట్‌లో పికెటింగ్స్, బారికేడ్లను ఏర్పాటు చేశారు.






