ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో అపచారం.. భవానీ భక్తుల ఇరుముడిని విప్పిన చైర్మన్, ఈవో

by Vemula.Srinu Prasad |

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో అపచారం చోటు చేసుకుంది..

ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో అపచారం.. భవానీ భక్తుల ఇరుముడిని విప్పిన చైర్మన్, ఈవో
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి(Vijayawada Indrakiladri Durgagudi) చైర్మన్, ఈవో తీరుపై గురు భవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీ భక్తుల ఇరుముడులను తాకి ఇంద్రకీలాద్రిపై అపచారం చేశారని మండిపడ్డారు. భవానీ ఇరుముడి బంధాలను ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ విప్పారని ఆరోపించారు. భవానీ భక్తుల దీక్ష విమరణ సందర్భంగా తొలి రోజు ఫొటో కోసం ఛైర్మన్, ఈవో అత్యుత్సాహం చూపారు. భవానీల ఇరుముడి బంధాలను సాధారణ వ్యక్తులు తాకరాదనే నిబంధన ఉందని, కానీ ఈవో, ఛైర్మన్ అపచారం చేశారని గురుభవానీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి పవిత్రను దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలంటే రాధాకృష్ణ, శీనానాయక్‌కు చులకగా ఉందని మండిపడ్డారు.

Next Story