- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. ఉపాధ్యాయుడికి దేహశుద్ది
పల్నాడు జిల్లా కారంపూడిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లితండ్రులు దేహశుద్ధి చేసారు.

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా కారంపూడిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లితండ్రులు దేహశుద్ధి చేసారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు నేరుగా తమ తల్లితండ్రులకు ఫిర్యాదు చేసారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లితండ్రులు పాఠశాలకు వచ్చి, సంబంధిత ఉపాధ్యాయుడు రవికుమార్ పై దాడి చేశారు. గురువు స్థానంలో ఉండి అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహంలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తుంటే.. పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ సంబంధిత ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని అక్కడే ఆందోళనకు దిగారు. తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు ఎంఈవో, పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పాఠశాలలో వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు.






