ఏపీలో స్వల్ప భూ ప్రకంపనలు.. భయాందోళనకు గురైన జనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-24 03:47:50  IST  )

ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు (Earthquakes) కలకలం సృష్టిస్తున్నాయి.

ఏపీలో స్వల్ప భూ ప్రకంపనలు.. భయాందోళనకు గురైన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు (Earthquakes) కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు (Ongole) జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. లాయర్‌పేట (Lawyerpeta), సీఎస్ఆర్ శర్మ కాలేజీ (CSR Sharma College) పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించినట్లుగా స్థానికులు తెలిపారు. అందుకు సంబంధించి విజువల్స్ కూడా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

కాగా, 2024 డిసెంబర్ 4న ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna District) పరిధిలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 7.20 గంటల సమయంలో కొద్ది సెకన్ల పాటు భూకంపం వచ్చింది. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణలోని ములుగు (Mulugu) జిల్లా కేంద్రంగా భూమి కంపించడంతో దాన్ని భూకంప కేంద్రంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి అడుగు భాగం నుంచి 200, 300 కి.మీటర్ల లోతులో ఈ ప్రకంపనలను గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైన విషయం తెలిసిందే.

వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Next Story