- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖకు పీఎం మోడీ.. యోగాంధ్ర ప్రోగ్రాం పై మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల(జూన్) 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా ఈ నెల(జూన్) 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సహచర మంత్రులతో కలిసి ఎన్డీయే కూటమి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ నిర్వహణ పై అధికారులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. గ్రామ, మండల స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ యోగా దినోత్సవం విజయవంతం చేయడంలో తమ వంతు పాత్ర నిర్వహించాలని సూచించారు. కూటమిలోని అన్ని పార్టీల వాళ్ళు సమన్వయంతో జనసమీకరణ చేయాలి. విశాఖకు వచ్చేవారికి అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని చెప్పారు.
రవాణా, ఆహార, వసతి, అత్యవసర వైద్య సేవలు వంటి వాటిలో ప్రభుత్వాధికారులకు సహకరించాలి. మెడికల్, హెల్త్ పర్యాటకానికి కీలకమైన ఈ కార్యక్రమం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. అందువల్ల ఎలాంటి అసౌకర్యాలు, లోటుపాట్లు లేకుండా కార్యక్రమం విజయవంతం అయ్యేలా చేయాలి. అలాగే గ్రామస్థాయి కోఆర్డినేటర్లు పల్లెల్లోనూ యోగా దినోత్సవ కార్యక్రమాలు సజావుగా, సక్రమంగా జరిగేలా చూడాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.






