- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP News:‘కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల వెల్లువ’.. మంత్రి కీలక వ్యాఖ్యలు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government)లో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందని మంత్రి కొలుసు పార్థసారథి(Minister Parthasarathy) తెలిపారు. నేడు రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ముగిసింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి.. నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పై మంత్రి పార్థసారథి మీడియాతో తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. 7 నెలల్లోనే రాష్ట్రానికి 6.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. నామినేటెడ్ పోస్టు(Nominated Post)ల్లో బీసీలకు 34 శాతం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
SC, ST, BC, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ప్రభుత్వం రూపొందించిన పాలసీని ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మా ప్రభుత్వం 34 దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి తెలిపారు. ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా 4.28 లక్షల ఉద్యోగాలు వస్తాయి. పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ(MSME) పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం పలికింది. అని మంత్ర పార్థసారథి వెల్లడించారు.