- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News:అన్నదాత సుఖీభవ అమలు పై మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ రోజు(శనివారం) "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ తరుణంలో మొదటగా సోంపేట మండలం భట్టిగల్లూరు నుంచి ఎకువూరు వరకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎకువూరు నుంచి భట్టిగల్లూరు వరకు రూ.94 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం "సుపరిపాలనలో తొలి అడుగు" బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. సర్దార్ గౌతు లచ్చన్న పుట్టిన ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఘనత టీడీపీకి మాత్రమే సాధ్యమని అన్నారు. మహిళలకు హక్కులు కల్పించి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించింది టీడీపీ ప్రభుత్వమే తేల్చి చెప్పారు. టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా రాష్ట్ర విభజన చేపట్టారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాం. కానీ చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ఇబ్బంది పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను నాశనం చేశారని మంత్రి ఆరోపించారు. అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడటం తప్ప జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మొదలు.. రాష్ట్రంలోని కీలక నాయకుల పై కేసులు పెట్టి వేధించాడని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని వేధించడం వైఎస్ జగన్ రెడ్డి అరాచకానికి నిదర్శనం అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
వైఎస్ జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయి.. తన్ని తరిమేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి గెలిపించారు. అప్పులు, ఆస్తుల తాకట్టు తప్ప జగన్ ఐదేళ్ల పాలనలో సాధించిందేమీ లేదు. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నాం అని తెలిపారు. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఎంత మంది పిల్లలు ఉన్నా అంత మందికి నినాదంతో తల్లికి వందనం అమలు చేశాం. గతంలో స్కూల్లో మధ్యాహ్న భోజనం 64 శాతం మంది మాత్రమే తింటే.. ప్రస్తుతం 100 శాతం చేస్తున్నారు.
ఇక, రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం తర్వలోనే అమలు చేయబోతున్నాం అని మంత్రి స్పష్టం చేశారు. ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం అన్నారు. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున సాయం చేస్తున్నాం. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమే. మత్స్యకారులకు 50 సంవత్సరాలకు పెన్షన్ అమలు చేసిన ఘనత మనదే. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
పెట్టుబడుల కోసం వచ్చే వారికి కుట్ర పూరితంగా లేఖలు రాయడం వైఎస్ జగన్ రెడ్డి నీచ బుద్ధికి తార్కాణం అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కుట్రలు చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది. మత్స్యకార గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. వైసీపీ నేతల అరాచకాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పని చేసే ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం అధికారంలో ఉండాలి. P4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈక్రమంలో పేదల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం లక్ష్యంగా ఎన్డీయే కూటమి పని చేస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరు కలిసి అడుగులు వేయాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.






